kumara swamy: ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్‌ గాంధీ వస్తామన్నారు: కుమారస్వామి

  • గాంధీ కుటుంబం మీద ఉన్న గౌరవంతోనే ఢిల్లీకి వచ్చాను
  • సోనియా, రాహుల్‌లను కలిశాను
  • డిప్యూటీ సీఎం అంశంపై రేపు కాంగ్రెస్‌ నిర్ణయం             
గాంధీ కుటుంబం మీద ఉన్న గౌరవంతోనే తాను ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలను కలిశానని జేడీఎస్‌ నేత కుమారస్వామి అన్నారు. ఈ రోజు వారిని కలిసిన అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ... తన ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని వారిని కోరానని, అందుకు వారు అంగీకరించారని తెలిపారు.

కర్ణాటకలో మంత్రి వర్గ కూర్పుపై తమ పార్టీ తరఫున చర్చించేందుకు రాహుల్‌ గాంధీ.. కాంగ్రెస్‌ కర్ణాటక జనరల్ సెక్రటరీ వేణుగోపాల్‌కి అనుమతి ఇచ్చారని, ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలని ఆయనకు చెప్పారని కుమారస్వామి అన్నారు. డిప్యూటీ సీఎం అంశంపై రేపు వేణుగోపాల్ తమ పార్టీ నేతలతో తుది సమావేశం నిర్వహిస్తారని చెప్పారు.                     
kumara swamy
Rahul Gandhi
Sonia Gandhi

More Telugu News