ఓ తండ్రిగా మా నాన్న నాకిచ్చిన ఎంతో విలువైన కానుకలివి: రాహుల్ గాంధీ
- నేడు రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి
- నివాళులర్పించిన సోనియా, రాహుల్, ప్రియాంక తదితరులు
- ప్రతి ఒక్కరిపై ప్రేమ, గౌరవం చూపించమని మా నాన్న చెప్పారు
కాగా, తన తండ్రికి నివాళులర్పించడానికి ముందు రాహుల్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో తన తండ్రి గొప్పతనాన్ని ప్రశంసించారు. ‘పగ, ద్వేషం వంటి వాటితో ఎవరైతే జీవిస్తారో వారు జైలులో గడుపుతున్నట్టేనని మా నాన్న నాకు చెప్పారు. ఈరోజు, మా నాన్న వర్ధంతి.. ప్రతి ఒక్కరిపై ప్రేమాభిమానాలు, గౌరవం చూపించాలని చెప్పిన మా నాన్నకు ధన్యవాదాలు. ఓ తండ్రిగా ఓ కొడుకుకిచ్చే ఎంతో విలువైన కానుకలివి’ అని అన్నారు.