amir khan: తండ్రి సమక్షంలో కెరీర్ కు పునాది వేసుకుంటున్న అమీర్ ఖాన్ కుమారుడు

  • తండ్రి వద్ద జునైద్ అప్రెంటిస్
  • నిర్మాణానికి సంబంధించి అన్ని అంశాలపై అధ్యయనం
  • గతంలో రాజ్ కుమార్ హిరానీ దగ్గర పనిచేసిన జునైద్
తండ్రికి తగ్గ తనయుడు అని అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నట్టున్నాడు. జునైద్ తండ్రితో కలసి తన కెరీర్ కు బలమైన పునాదులు వేసుకునే క్రమంలో ఉన్నాడు. అందుకే తండ్రితో కలసి పనిచేస్తున్నాడు. జునైద్ తనతో కలసి పనిచేస్తున్నట్టు అమీర్ ఖాన్ సైతం తెలిపాారు.

అమీర్ ఖాన్ గొప్ప నటుడే కాదు, నిర్మాత అని కూడా తెలిసిందే. నిజానికి అమీర్ ఖాన్ తన పిల్లలు జునైద్, ఇరాపై తన అభిప్రాయాలను రుద్దే రకం కాదు. వారికి కెరీర్ పరమైన సూచనలు కూడా ఇచ్చేందుకు ఇష్టపడరు. వారి స్వేచ్ఛ ప్రకారం నిర్ణయం తీసుకోవాలన్నది అమీర్ ఖాన్ అభిప్రాయం.

20 ఏళ్ల వయసు, ఆరడుగుల అందగాడైన జునైద్ నిర్మాత రాజ్ కుమార్ హిరాని దగ్గర చేరి కొన్ని సినిమాలకు సహాయకుడిగా సేవలందించాడు. ఇప్పుడు తండ్రి అమీర్ ఖాన్ దగ్గర అప్రెంటిస్ గా పనిచేయాలని నిర్ణయం తీసుకుని అదే పని చేస్తున్నాడు. తండ్రి దగ్గర నిర్మాణానికి సంబంధించి అన్ని కోణాల్లో అంశాలను తెలుసుకుంటున్నాడు. అమీర్ ఖాన్ సైతం అదనపు సమయం కేటాయిస్తున్నారట.
amir khan
junaid khan

More Telugu News