బెంగళూరులోని హోటల్‌లో కనపడిన ఆ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే.. మరో ఎమ్మెల్యే కోసం పోలీసుల తనిఖీలు

  • కనపడకుండా పోయిన ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 
  • ఆనంద్‌ సింగ్, ప్రతాప్‌ గౌడ పాటిల్ హోటల్‌లో ఉన్నట్లు స్పష్టం
  • హోటల్‌ నుంచి బయలుదేరిన ఆనంద్‌ సింగ్‌
కనపడకుండా పోయిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆనంద్‌ సింగ్, ప్రతాప్‌ గౌడ పాటిల్ బెంగళూరులోని గోల్డ్‌ఫించ్ హోటల్‌లో ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో ఆ హోటల్‌ వద్దకు చేరుకున్న పోలీసులు ఆ ఇద్దరు ఎమ్మెల్యేల కోసం ఆరా తీస్తున్నారు. కర్ణాటక డీజీపీ నీలమణిరావ్‌ ఆ హోటల్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, అదే సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ సింగ్ సదరు హోటల్‌ నుంచి బయలుదేరారు. ఆయన నేరుగా అసెంబ్లీకే వెళతారా? అన్న సందేహం నెలకొంది.

ప్రతాప్‌ గౌడ పాటిల్‌ కూడా అదే హోటల్‌లో ఉన్నారా? అన్న విషయం తెలియాల్సి ఉంది. సదరు ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో వారు బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డితోనే ఉన్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.
Go Back to Shorts
Congress
Karnataka
Police

More Telugu News