తొందరొద్దు... ముందు మీ సత్తా నిరూపించుకోండి: ప్రకాశ్ రాజ్ సూచన

  • రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో తొందర, నిరాశ వద్దు
  • ముందు సభలో మీరేంటో నిరూపించుకోండి
  • ప్రజాస్వామ్య యుతంగా నడుచుకోండి
కర్ణాటక రాజకీయ పార్టీలకు నటుడు ప్రకాశ్ రాజ్ కీలక సూచన చేశారు. 'కర్ణాటక బ్రేకింగ్ న్యూస్' పేరుతో ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టారు. ‘‘ప్రియమైన రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలూ... రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో తొందర పడొద్దు, నిరాశవద్దు. ముందు మీ సామర్థ్యాన్ని, మీరెవరన్నది సభలో రేపు సాయంత్రం 4 గంటల్లోగా నిరూపించుకోండి. ప్రజాస్వామ్యయుతంగా నడుచుకోండి’’ అని హితవు పలికారు.

కాంగ్రెస్-జేడీఎస్, బీజేపీ ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ, ప్రభుత్వ ఏర్పాటుకు వ్యూహ, ప్రతివ్యూహాలను రచిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ప్రకాశ్ రాజ్ ఇలా స్పందించడం గమనార్హం.
Go Back to Shorts
prakashraj
karnataka

More Telugu News