Supreme Court: చట్టపరంగా బ్రేక్ పడింది... ఇక ధన, కండబలంతో ప్రయత్నిస్తారు: రాహుల్

  • గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు
  • కోర్టు తీర్పుతో మేం చెబుతున్నది నిజమైంది
  • చట్టపరంగా వారికి బ్రేకులు పడ్డాయి
కర్ణాటక విషయంలో సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వాగతించారు. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని తాము చెబుతున్నదే ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పుతో నిజమైందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సంఖ్యాబలం లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్న  బీజేపీ  వైఖరిని కోర్టు తప్పు బట్టిందన్నారు.

చట్టపరంగా బ్రేక్ పడిందని, వారిక ధన, కండబలంతో ప్రజాతీర్పును దోచుకోవడానికి ప్రయత్నిస్తారని ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రేపు సాయంత్రం 4 గంటల్లోగా యడ్యూరప్ప సర్కారు సభలో మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది.  
Supreme Court
Rahul Gandhi

More Telugu News