karnataka: సుప్రీంకోర్టు తీర్పుపై యడ్యూరప్ప స్పందన

  • సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం
  • రేపటి బలపరీక్షలో నెగ్గుతాం
  • ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటాం
రేపు సాయంత్రం 4 గంటలకు శాసనసభలో బలపరీక్షను ఎదుర్కోవాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తాము పాటిస్తామని చెప్పారు. బలపరీక్షకు తాము సిద్ధమని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడతామని, రేపు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెబుతామని అన్నారు. బలపరీక్షలో నెగ్గుతామని తమకు 100 శాతం నమ్మకం ఉందని చెప్పారు. కర్ణాటకలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఐదేళ్ల పాటు పాలిస్తామని అన్నారు.
karnataka
Supreme Court
yeddyurappa
floor test

More Telugu News