Karnataka: హైదరాబాద్ కు చేరిన కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు... కాంగ్రెస్ నేత హోటల్ లో మకాం!

  • 76 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు
  • పార్క్ హయత్ లో మకాం
  • పోలీసు బందోబస్తు పెంపు
కర్ణాటకలో తమ ఎమ్మెల్యేలు ఫిరాయించకుండా కాపాడుకోవాలన్న ఉద్దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, తమ తరఫున గెలిచిన 78 మందిలో 76 మందిని హైదరాబాద్ తరలించింది. గత రాత్రి ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్ వచ్చిన వీరు, కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత టీ సుబ్బరామిరెడ్డికి చెందిన పార్క్ హయత్ హోటల్ లో మకాం వేశారు. వారు వస్తున్నారన్న సమాచారం ముందే అందడంతో బంజారాహిల్స్ ప్రాంతంలో పోలీసు బలగాలను మోహరించారు. ఇక కర్ణాటక రాజకీయాల్లో ఎమ్మెల్యేల తరలింపుతో హైడ్రామా కొనసాగుతోంది. కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, రాజశేఖర్ పాటిల్ ఇప్పటికే ఫిరాయించేసినట్టు తెలుస్తోంది. మరోవైపు కర్ణాటక గవర్నర్ తీరుపై నేడు దేశవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Karnataka
Congress
Hyderabad
MLAs
Park Hayat

More Telugu News