Karnataka: ఐదేళ్లూ నేనే సీఎం: తొలి మీడియా సమావేశంలో యడ్యూరప్ప

  • మొత్తం పదవీకాలాన్ని పూర్తి చేస్తాం
  • ఎన్నికల తరువాత జేడీఎస్ - కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి
  • అది పూర్తి అనైతికమన్న యడ్యూరప్ప
తన ప్రభుత్వం వచ్చే ఐదేళ్లూ అధికారంలోనే ఉంటుందని, మొత్తం పదవీ కాలాన్ని తాను ముఖ్యమంత్రిగా పూర్తి చేసి తీరుతానని బీఎస్ యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. ఈ ఉదయం కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన, తొలి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు ముగిసిన తరువాత కాంగ్రెస్ - జేడీఎస్ లు పొత్తును పెట్టుకోవడం అనైతికమని, వారు అధికారకాంక్షతోనే ఈ పని చేశారని ఆరోపించారు.

తాము ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఏ విధమైన ప్రలోభాలకూ గురి చేయాలని భావించడం లేదని వ్యాఖ్యానించిన యడ్డీ, ఎమ్మెల్యేలు తమంతట తామే మద్దతిస్తామని వస్తున్నారని వ్యాఖ్యానించారు. తమకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల జాబితాను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సాధ్యమైనంత త్వరలోనే అసెంబ్లీ వేదికగా తన బలాన్ని నిరూపించుకుంటానని, అందులో ఎటువంటి సందేహమూ లేదని యడ్యూరప్ప తెలిపారు.
Karnataka
Kumaraswamy
Yediyurappa
Congress
JDS

More Telugu News