Ram Jethmalani: కర్ణాటక గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన రాంజెఠ్మలానీ

  • వ్యక్తిగత హోదాలో పిటిషన్
  • కర్ణాటక గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేసిన జెఠ్మలానీ
  • ఇప్పటికే సుప్రీంకోర్టు ముందు కాంగ్రెస్ పిటిషన్
ప్రముఖ న్యాయనిపుణుడు రాంజెఠ్మలానీ ఈ రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తూ గవర్నర్ వాజుభాయి వాలా తీసుకున్న నిర్ణయాన్ని వ్యక్తిగత హోదాలో ఆయన సవాల్ చేశారు. గవర్నర్ ఆహ్వానం మేరకు బీఎస్ యడ్యూరప్ప ఈ రోజు కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

బలనిరూపణకు ఆయనకు గవర్నర్ 15 రోజుల గడువు ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది. అయితే, గవర్నర్ నిర్ణయంపై నిన్న రాత్రే కాంగ్రెస్ సుప్రీంకోర్టు తలుపు తట్టగా, యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ కేసులో తమ తుది ఆదేశాలకు లోబడి ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారం ఉంటాయని మాత్రం స్పష్టం చేసింది.

Ram Jethmalani
Supreme Court

More Telugu News