రవితేజ కొత్త సినిమా ట్రైలర్ విడుదల

  • అలరిస్తోన్న ‘నేల టిక్కెట్టు’ సినిమా ట్రైలర్‌ 
  • కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా
  • విలన్‌గా జగపతి బాబు
మాస్‌ మహారాజా రవితేజ నటించిన ‘నేల టిక్కెట్టు’ సినిమా ట్రైలర్‌ను ఆ చిత్ర యూనిట్‌ ఈ రోజు విడుదల చేసింది. ఈ సినిమాను కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి నిర్మించారు. ఇందులో రవితేజ సరసన మాళవిక శర్మ నటించింది. సంగీత దర్శకుడు శక్తికాంత్‌ కార్తీక్‌ అందించిన బాణీలు అలరిస్తున్నాయి. ఈ ట్రైలర్‌లో రవితేజ చేస్తోన్న ఫైట్స్‌, డ్యాన్స్‌ అదుర్స్‌ అనిపిస్తున్నాయి.

'ఎంత మంది కష్టాల్లో ఉన్నారో చూడరా.. కానీ సాయం చేసేవాడు ఒక్కడూ లేడు' అంటూ రవితేజ డైలాగు చెప్పడాన్ని ఈ ట్రైలర్ లో చూడచ్చు. ఇందులో రవితేజ వృద్ధులకు సాయం చేస్తూ వారి పక్షాన మాట్లాడుతున్నాడు. అలాగే, జగపతి బాబు ప్రతినాయకుడి పాత్రలో కనపడుతూ 'నేను ఎదగడానికి ఎంత మందినైనా తొక్కేస్తాను' అంటూ డైలాగు కొట్టాడు.                              
Go Back to Shorts
Raviteja
Tollywood
trailer

More Telugu News