TTD: తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాజకీయనాయకులే భ్రష్టుపట్టిస్తున్నారు!: ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు

  • అధికారులు కూడా స్వామి వారి కైంకర్యాల్లో తలదూర్చుతున్నారు
  • స్వామి వారికి ఆరాధనలు సక్రమంగా జరగట్లేదు
  • రాజకీయ నాయకుల కబంధహస్తాల నుంచి ఆలయాన్ని కాపాడుకోవాలి

తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాజకీయనాయకులే భ్రష్టుపట్టిస్తున్నారని టీటీడీ ఆలయ ప్రధాన అర్చక్షుడు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డూ ప్రసాదాన్ని వ్యాపారంగా మార్చుతున్నారని విమర్శించారు. 1996లో శ్రీవారి ఆలయంలో వంశ పారంపర్యం అర్చకత్వాన్ని ప్రభుత్వం ఉన్నపళంగా రద్దు చేసిందని, అందుకు గల కారణాలు తెలియవని అన్నారు. వంశపారంపర్య అర్ఛకత్వాన్ని రద్దు చేసిన ప్రభుత్వం అందుకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదని విమర్శించారు.

అధికారులు కూడా స్వామి వారి కైంకర్యాల్లో తలదూర్చుతున్నారని, ఈ విషయమై అర్చకులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. స్వామి వారికి జరగాల్సిన ఆరాధనలు సక్రమంగా జరగకపోవడం వల్ల ఆయనకు ఆగ్రహం వస్తుందనేది ఆగమవాక్యమని చెప్పారు. ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉన్న తనకే స్వామి వారి ఆభరణాల వివరాలు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన రమణ దీక్షితులు, శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి ఇచ్చిణ ఆభరణాలు ఎక్కడున్నాయని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. రాజకీయ నాయకుల కబంధహస్తాల నుంచి శ్రీవారి ఆలయాన్ని కాపాడుకోవాలని చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు.

More Telugu News