Karnataka: కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం హెలికాప్టర్లను పంపిన బీజేపీ

  • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్న బీజేపీ
  • బీజేపీకి మద్దతు ప్రకటించిన ఇద్దరు ఎమ్మెల్యేలు
  • వారికోసం ప్రత్యేక హెలికాప్టర్లను పంపిన బీజేపీ అధిష్ఠానం
కర్ణాటక ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు 8 అడుగులు (ఎమ్మెల్యేలు) దూరంలో నిలిచిపోయిన బీజేపీ... ఎలాగైనా సరే అధికారపీఠాన్ని అధిష్టించాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో, ఆపరేషన్ ఆకర్ష్ కు తెరదీసింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందుబాటులో లేకుండా పోయారని తెలుస్తోంది.

కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి వీరు డుమ్మా కొట్టారు. ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో లేరని సమాచారం. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భీమానాయక్, అమెర్ గౌడ నాయక్ లు బీజేపీకి మద్దతు ప్రకటించినట్టు విశ్వసనీయ సమాచారం. వీరి కోసం బీదర్, గుల్బర్గాలకు బీజేపీ అధిష్ఠానం ప్రత్యేక హెలికాప్టర్లను పంపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, బెంగళూరు రాజకీయం మరింత వేడెక్కింది.
Karnataka
elections
bjp
congress
jds
mla
helicopter

More Telugu News