Karnataka: ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినంత మెజారిటీ బీజేపీకి లేదు: ‘లోక్ సత్తా’ జేపీ

  • బీజేపీ విజయం కోసం పార్టీ కార్యకర్తలు నిబద్ధతతో పనిచేశారు
  • మిగిలినపార్టీల్లో అది కొరవడింది!
  • జేడీఎస్-కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసేలా గవర్నర్ నిర్ణయం ఉంటుందేమో!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సినంత మెజారీటీ లేదని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ (జేపీ) అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి వేరే పార్టీల మద్దతు ఎలా లభిస్తుందని ఆయన ప్రశ్నించారు. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా గవర్నర్ నిర్ణయం ఉండచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, కర్ణాటకలో బీజేపీ ఎక్కువ స్థానాల్లో విజయం కోసం ఆ పార్టీ కార్యకర్తలు నిబద్ధతతో, ఆత్మవిశ్వాసంతో పని చేశారని ప్రశంసించిన ఆయన, మిగిలిన పార్టీల్లో అది కొరవడిందని అన్నారు.
Karnataka
lok satha jp

More Telugu News