Karnataka: వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ గెలుపు ఖాయం: నటుడు కృష్ణంరాజు

  • మా పార్టీ ఉత్తర భారతదేశ పార్టీ అనే అపోహ తొలగిపోయింది
  • తెలుగు ఓటర్లు బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు
  • కర్ణాటకలో బీజేపీ ఓటమికి టీడీపీ చేసిన యత్నాలు ఫలించలేదు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత, సీనియర్ నటుడు కృష్ణంరాజు స్పందించారు. కర్ణాటకలో ప్రజలు ఇచ్చిన తీర్పుతో తమ పార్టీ ఉత్తర భారతదేశ పార్టీ అనే అపోహ తొలగిపోయిందని అన్నారు. కర్ణాటకలోని తెలుగు ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారని అన్నారు.

ఈ సందర్భంగా టీడీపీపై ఆయన విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో బీజేపీ ఓటమికి టీడీపీ చేసిన యత్నాలు ఫలించలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, కేసీఆర్, చంద్రబాబులు పిలుపునిచ్చినప్పటికీ తెలుగు ప్రజలు బీజేపీకే ఓటు వేశారని అన్నారు. కర్ణాటకలో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేకపోయారని అన్నారు.
Karnataka
krishnamraju

More Telugu News