Karnataka: అతి పెద్ద పార్టీగా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం!: గవర్నర్‌ తో యడ్యూరప్ప

  • రసవత్తరంగా కర్ణాటక రాజకీయాలు
  • తమకు మద్దతు ఉందని వ్యాఖ్య
  • కాసేపట్లో రాజ్‌భవన్‌కు జేడీఎస్‌, కాంగ్రెస్‌ కూడా
కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే జేడీఎస్‌ గవర్నర్‌కు లేఖ కూడా రాసి అపాయింట్‌మెంట్‌ కోరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ నేతలతో కలిసి జేడీఎస్‌ నేత కుమారస్వామి కాసేపట్లో గవర్నర్‌ వద్దకు వెళుతుండగా, మరోవైపు యడ్యూరప్ప ఇప్పటికే రాజ్‌భవన్‌ చేరుకుని గవర్నర్‌ని కలిసి కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ను కలిసి కాసేపు చర్చించారు. రాష్ట్రంలో తమకే ఎక్కువ సీట్లు వచ్చాయని, అతి పెద్ద పార్టీగా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్ కు చెప్పారు. ఈ క్రమంలో కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.
Karnataka

More Telugu News