కృష్ణగారితో చాలా పెద్ద గొడవే అయింది!: తమ్మారెడ్డి భరద్వాజ
- కృష్ణగారితో 'రౌడీ అన్నయ్య' చేశాను
- ఒక సాంగ్ విషయంలో పేచీ వచ్చింది
- నా నిర్ణయం ఆయనకి కోపం తెప్పించింది
"బాబూ మోహన్ తో చేసే ఆ సాంగ్ లో కృష్ణగారు కనిపించకూడదని నేను అంటాను. తాను కనిపించకపోతే ఎలా అంటారు ఆయన. దాంతో ఇటు కృష్ణగారితోను .. ఆయనకి తెలియకుండా అటు బాబుమోహన్ తోను సాంగ్ చేయడం జరిగింది. సెన్సార్ కి మాత్రం బాబుమోహన్ సాంగ్ ఉండేలా చూశాను. ఆ సాంగ్ పట్ల సెన్సార్ వారు అభ్యంతరం చెప్పడంతో కృష్ణగారు జోక్యం చేసుకోవడం .. సెన్సార్ ఆఫీస్ కి వెళ్లి ఆ సాంగ్ చూడటం జరిగిపోయింది. తన సాంగ్ కాకుండా బాబూమోహన్ సాంగ్ ఉండటం చూసి ఆయనకి కోపం వచ్చేసింది. నా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ రోజుతో తమ ఫ్రెండ్షిప్ కట్ అని చెప్పేసి వెళ్లిపోయారు" అంటూ చెప్పుకొచ్చారు .