మరో పది నిమిషాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. 9 గంటలకే ట్రెండ్ బయటకు
- ఓట్లు లెక్కింపు ప్రారంభమైన గంటకే సరళి వెల్లడి
- లెక్కింపులో పాల్గొననున్న11 వేల మంది సిబ్బంది
- మధ్యాహ్నానికి స్పష్టత
ఓట్ల లెక్కింపులో మొత్తం 11 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు. ప్రతీ టేబుల్ వద్ద లెక్కింపును 100 మంది పర్యవేక్షించనున్నారు. 9 గంటలకల్లా సరళి వెల్లడి కానుంది. మధ్యాహ్నానికి గెలుపెవరిదో తేలిపోతుంది. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతంలో వంద మీటర్ల వరకు పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. బెంగళూరులో 5 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ప్రతీ కేంద్రంలోనూ 14 టేబుళ్లు ఉన్నాయి. కాగా, బీజేపీ ఎన్నికల పరిశీలకులుగా పీయూష్ గోయల్, జవదేవకర్ వ్యవహరించనుండగా, కాంగ్రెస్ నుంచి అశోక్ గెహ్లట్, ఆజాద్ ఎన్నికల పరిశీలకులుగా నియమితులయ్యారు.