USA: అమెరికాలో మృతి చెందిన తెలంగాణ వాసి!

  • బోటు ప్రమాదంలో మృతి చెందిన వెలమ వెంకట్రామిరెడ్డి (40)
  • అమెరికా లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం 
  • వారం రోజుల్లో స్వగ్రామానికి మృతదేహం
అమెరికాలోని డల్లాస్‌లో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి బోటు ప్రమాదంలో మృతి చెందారు. కామారెడ్డి జిల్లా మచారెడ్డి మండలం ఆరెపల్లికి చెందిన వెలమ వెంకట్రామిరెడ్డి (40) అమెరికా లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నారు. తన స్నేహితులతో కలిసి బోటింగ్‌ చేయడానికి వెళ్లిన ఆయన నీట మునిగి ప్రమాదవశాత్తు మరణించారు. దీంతో సమాచారం తెలుసుకున్న డల్లాస్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కాగా, వెంకట్రామిరెడ్డి మృతదేహం వారం రోజుల్లో స్వగ్రామానికి రానుంది.
USA
India
Hyderabad
Andhra Pradesh
Telangana

More Telugu News