Jagan: జగన్ పాదయాత్రలో.. వైసీపీ కార్యకర్తల మధ్య చింతమనేని ప్రభాకర్‌ కాన్వాయ్!

  • అప్రమత్తమైన పోలీసులు
  • చింతమనేనితో వైసీపీ కార్యకర్తల సెల్ఫీలు
  • వైసీపీ కార్యకర్తలకు చాక్లెట్లు ఇచ్చిన చింతమనేని
ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర కొనసాగిస్తోన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి... కృష్ణా జిల్లాలో తన యాత్ర ముగించుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగుపెట్టారు. దెందులూరు నియోజక వర్గం ఏలూరు గ్రామీణ మండలంలోని కొవ్వాడలంక వద్ద నుంచి జగన్ ఈ రోజు పాదయాత్ర ప్రారంభించారు. లింగాలగూడెం వద్దకు జగన్ పాదయాత్ర రాగానే అదే సమయంలో అదే ప్రాంతంలో ఓ చర్చి ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే చింతమనేని హాజరయ్యారు. దీంతో వైసీపీ కార్యకర్తల మధ్య నుంచి ఆయన కాన్వాయ్ ముందుకు కదలలేక ఆగిపోయింది.
 
వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాన్వాయ్‌ను ముందుకు వెళ్లేలా చేశారు. కాగా, వైసీపీ కార్యకర్తలు చింతమనేనితో సెల్ఫీలు తీసుకోవడం గమనార్హం. మరోవైపు చింతమనేని ప్రభాకర్ తన వద్ద ఉన్న చాక్లెట్లను తీసి వైసీపీ కార్యకర్తలకు పంచుకుంటూ వెళ్లారు. ఎవరి కార్యక్రమాలు వారు చేసుకుంటారంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు.                                                                                                                                               
Jagan
Chinthamaneni Prabhakar
YSRCP
Telugudesam

More Telugu News