Telugudesam: ఏపీకి అన్యాయం చేశారనే కడుపు మంటతోనే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చు!: ఎంపీ కేశినేని నాని

  • బీజేపీ మనకు అన్యాయం చేస్తుందని ఏడాది క్రితమే చెప్పా
  • విభజన హామీలు అమలు జరిగే వరకు మా పోరాటం ఆగదు
  • బీజేపీ సహకారంతో జగన్ సీఎం కావాలని చూస్తున్నాడు!
బీజేపీ మనకు అన్యాయం చేస్తుందని ఏడాది క్రితమే చెప్పానని ఏపీ టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో అమిత్ షా కాన్వాయ్ పై దాడి ఘటన గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ఏపీకి అన్యాయం చేశారనే కడుపు మంటతోనే ఐదు కోట్ల మంది ప్రజలు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు జరిగే వరకు తమ పోరాటం ఆగదని మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పై ఆరోపణలు గుప్పించారు. బీజేపీ సహకారంతో జగన్ సీఎం కావాలని చూస్తున్నాడని అన్నారు.
Telugudesam
Kesineni Nani

More Telugu News