ap bjp: ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిని కలిసిన ముద్రగడ!

  • గుంటూరులో కన్నాను కలిసిన ముద్రగడ
  • కొత్త అధ్యక్షుడికి అభినందనలు తెలిపిన కాపు ఉద్యమనేత
  • కన్నా నివాసం వద్ద అభిమానుల సందడి
ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. కన్నాకు అభినందనలు తెలిపారు. కన్నా నియామకం వార్త తెలిసిన అనంతరం లక్ష్మీనారాయణను ఏకాంతంగా ముద్రగడ కలిశారు.  వీరి ఏకాంత భేటీలో ఏ అంశాల గురించి చర్చించారో తెలియాల్సి ఉంది.

కాగా, ఒకే సామాజిక వర్గానికి చెందిన కన్నా, ముద్రగడ లిద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉండగా మంచి మిత్రులు. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నియమితుడైన కన్నాకు అభినందనలు తెలిపేందుకు ముద్రగడ వచ్చారని సమాచారం. గుంటూరులోని కన్నా నివాసం వద్దకు ఆయన అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. పలువురు ప్రముఖుల నుంచి కన్నాకు అభినందనలు అందుతున్నాయి.  
ap bjp
kanna
kapu mudragad

More Telugu News