హత్య కేసులో తృణమూల్ నేత అరెస్ట్... ఇంట్లో సోదాలు జరిపితే బక్కెట్ల కొద్దీ బాంబులు!
- హత్య కేసులో ప్రమేయమున్న అరాబుల్ ఇస్లాం అరెస్ట్
- ఆయన ఇంట్లో భూమిలో పాతిపెట్టిన బాంబులు
- స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఇక ఆయన అరెస్ట్ తరువాత ఇంట్లో సోదాలు జరుపగా, భూమిలో పాతిపెట్టిన బక్కెట్ల కొద్దీ బాంబులు కనిపించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అరాబుల్ ను కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఘటన జరిగిన రోజు తాను భంగార్ ప్రాంతంలో లేనని అన్నారు. ఇక అరాబుల్ అరెస్ట్ బాధిత కుటుంబానికి కంటితుడుపు చర్యేనని విపక్షాలు వ్యాఖ్యానించారు.
కాగా, అరాబుల్ వైఖరితో గతంలోనూ మమతా బెనర్జీ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అతన్ని 2013లో పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మమత, ఆపై ఏడాదిన్నర తరువాత మరోసారి పార్టీలోకి తీసుకున్నారు. ఆయన్ను ఇప్పుడు మరోసారి సస్పెండ్ చేయవచ్చని తెలుస్తోంది.