తన అందంతో హవాలా రాణిగా ఎదిగిన ప్రియ... పోలీసులతో ఫోన్ కాల్ వైరల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన అందంతో హవాలా రాణిగా ఎదిగిన ప్రియ... పోలీసులతో ఫోన్ కాల్ వైరల్!

  • పన్ను చెల్లించకుండా లగ్జరీ వస్తువులు తెప్పించే ప్రియ
  • ఆమె కస్టమర్లలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు
  • డబ్బివ్వకుంటే హత్య చేయిస్తానని బెదిరించిన క్రైమ్ బ్రాంచ్ అధికారి
  • వైరల్ అవుతున్న ఆడియో క్లిప్
బెంగళూరుకు చెందిన ప్రియ... తక్కువ ధరకు లగ్జరీ కార్లను, బంగారాన్ని విక్రయిస్తుంటుంది. విదేశాల నుంచి డబ్బు తెప్పించడం, ఇక్కడి నుంచి అక్కడికి పంపడం వంటి హవాలా పనులు చేస్తుంటుంది. తాను హవాలా రాణిగా ఎదిగే క్రమంలో తన అందాన్ని అధికారులకు ఎరగా వేసేది. తాజాగా ఆమె ఓ పోలీసు అధికారితో మాట్లాడుతున్న ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ప్రియను అరెస్ట్ చేసి ఆమె సాగించిన దందాలపై దృష్టి సారించారు.

పోలీసు వర్గాల కథనం ప్రకారం, పూన్ గుండ్రాన్ (40) అనే వ్యక్తి స్పెషల్ బ్రాంచ్ - క్రిమినల్ విభాగంలో పనిచేస్తూ తిరుకొయిలూరులో పని చేస్తున్నాడు. అతను ప్రియతో మాట్లాడుతూ తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుంటే హత్య చేయిస్తానని బెదిరిస్తూ మాట్లాడారు. తనకున్న 22 ఏళ్ల సర్వీస్ అనుభవంతో ఏదైనా చేయగలనని చెప్పాడు. వెంటనే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ రికార్డెడ్ కాల్ విల్లుపురం ఏరియాలో తొలుత, ఆపై రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయింది.

పలువురు పోలీసు ఉన్నతాధికారులు పూన్ గుండ్రాన్ మధ్యవర్తిగా ఖరీదైన వాహనాల కోసం ప్రియకు డబ్బు ఇచ్చినట్టు తెలుస్తోంది. పన్నులు చెల్లించకుండా బంగారం, వాహనాలను విదేశాల నుంచి తెప్పించే ప్రియ, ఈరోడ్ ప్రాంతానికి చెందిన యువతి అని, ఆపై బెంగళూరులో స్థిరపడిందని అధికారులు చెబుతున్నారు. ఆమెకు పూన్ గుండ్రాన్ దాదాపు కోటి రూపాయలు ఇచ్చాడని అధికారులు తేల్చారు. కేసును విచారిస్తున్నామని అన్నారు.
Tamilnadu
Karnataka
Chennai
Villupuram
Priya

More Telugu News