2008లోనే బీజేపీతో ఇబ్బందులు పడ్డాం.. అలాంటి పొరపాటు మళ్లీ చేయదల్చుకోలేదు: దేవెగౌడ
- కన్నడిగులు ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తున్నారు
- ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ఆలోచన లేదు
- జేడీఎస్ ఘన విజయం సాధిస్తుంది
కాంగ్రెస్ తో కానీ, బీజేపీతో కానీ పొత్తుపెట్టుకునే ఆలోచన తమకు లేదని అన్నారు. 2008లో బీజేపీతో కూటమి ఏర్పాటు చేసుకున్నామని... ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డామని, ఇకపై అలాంటి పని చేయదల్చుకోలేదని చెప్పారు. హాసన్ జిల్లాలోని తన స్వగ్రామం హోలెనరసిపురలో దేవెగౌడ, ఆయన భార్య చెన్నమ్మలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.