'మహానటి'ని చూస్తానంటున్న బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రేఖ!
- జెమినీ గణేశన్ .. పుష్పవల్లి కూతురు రేఖ
- ఆమెకి సావిత్రి పిన్ని అవుతుంది
- అందుకే 'మహానటి' మూవీ పట్ల ఆసక్తి
ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రేఖ చూడాలనుకుంటోందట. రేఖకి .. సావిత్రి పిన్ని అవుతుంది. జెమినీ గణేశన్ రెండవ భార్య పుష్పవల్లికి రేఖ .. రాధ అనే ఇద్దరు కుమార్తెలు వున్నారు. ఆ తరువాతనే ఆయన సావిత్రిని వివాహం చేసుకున్నాడు. తన తండ్రి జీవితంతో ముడిపడిన సినిమా కావడం వలన, తాను చూడాలనుకుంటున్నట్టు తన సోదరి రాధ ద్వారా ఆమె దర్శక నిర్మాతలకు కబురు పంపించిందట. త్వరలో రేఖ కోసం స్పెషల్ షో ఏర్పాటు చేస్తారేమో చూడాలి.