క్రిప్టో కరెన్సీని తీసుకొచ్చేందుకు ఫేస్ బుక్ ఆసక్తి... ప్రత్యేక టీమ్ ఏర్పాటు
- ఫేస్ బుక్ కు 200 కోట్ల మంది యూజర్లు
- బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి
- ప్రకటించిన కంపెనీ
’’ఫేస్ బుక్ లో బ్లాక్ చెయిన్ టెక్నాలజీని ఏ విధంగా మెరుగ్గా వినియోగించుకోవచ్చనే దాన్ని పరిశీలించేందుకు ఓ చిన్న జట్టును ఏర్పాటు చేశా’’ అని ఫేస్ బుక్ మెస్సెంజర్ ఎగ్జిక్యూటివ్ ఇంచార్జ్ డేవిడ్ మార్కస్ తెలిపారు. ఇతర కంపెనీల మాదిరిగానే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ శక్తిని అందిపుచ్చుకునేందుకు ఫేస్ బుక్ ప్రయత్నిస్తుందని కంపెనీ సైతం ప్రకటన జారీ చేసింది. భిన్నమైన అప్లికేషన్లను బ్లాక్ చెయిన్ ఆధారంగా తీసుకురావడంపై ఈ జట్టు దృష్టి పెడుతుందని తెలిపింది. ఇంతకంటే చెప్పేందుకు ప్రస్తుతానికి ఏమీ లేదని పేర్కొంది. బిట్ కాయిన్ సైతం బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగానే పనిచేస్తుందని తెలిసిందే.