కోహ్లీ రెస్టారెంట్ లో సందడి చేసిన ఆర్సీబీ ఆటగాళ్లు
- ఢిల్లీలో నుయేవా పేరుతో రెస్టారెంట్ నిర్వహిస్తున్న కోహ్లీ
- నిన్న రాత్రి తన సహచరులను రెస్టారెంట్ కు తీసుకెళ్లిన కెప్టెన్
- అన్ని వెరైటీలను ఎంజాయ్ చేసిన ఆర్సీబీ ప్లేయర్లు
ఐపీఎల్ లో భాగంగా బెంగళూరు జట్టు ఢిల్లీకి వచ్చినప్పుడు ఆటగాళ్లకు తన రెస్టారెంట్ వంటకాలను రుచి చూపించడం కోహ్లీకి అలవాటు. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగానే తన సహచరులను రెస్టారెంట్ కు తీసుకెళ్లాడు కోహ్లీ. ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య శనివారం మ్యాచ్ జరగనుంది.