వాస్తవానికి ఈ రెండు పార్టీలూ అవినీతితో పెనవేసుకున్నవే!: జస్టిస్ సంతోష్ హెగ్డే
- కర్ణాటకలో ఎన్నికలు సక్రమంగా జరగడం లేదు
- నేరస్తులు, అవినీతిపరులకు టికెట్లు ఇచ్చారు
- బీజేపీ, కాంగ్రెస్ రెండూ అవినీతి పార్టీలే
బీజేపీ, కాంగ్రెస్ లు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ... వాస్తవానికి రెండు పార్టీలు ఒకే దృక్పథాన్ని కలిగి ఉన్నాయని సంతోష్ హెగ్డే చెప్పారు. కర్ణాటక ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరగడం లేదని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు సత్యాన్ని గౌరవించే స్థితిలో లేవని విమర్శించారు. నేరస్తులు, అవినీతిపరులకు టికెట్లు ఇచ్చాయని మండిపడ్డారు. అభ్యర్థులపై ఉన్న ఆరోపణలను ఆయా పార్టీలు పట్టించుకోవడం లేదని... ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు.