Karnataka: కర్ణాటకలో 58,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం: ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్

  • ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయినట్టే
  • మహిళల కోసం ప్రత్యేకంగా 600 కేంద్రాలు
  • 80,000 ఈవీఎంలతో పాటు అంతే సంఖ్యలో వీవీపాడ్స్
ఈ నెల 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయినట్టేనని రాష్ట్ర ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 58,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇందులో మహిళల కోసం ప్రత్యేకంగా 600 కేంద్రాలు, దివ్యాంగుల కోసం 10కి పైగా కేంద్రాలను కేటాయించినట్టు చెప్పారు.

 80,000 ఈవీఎంలతో పాటు అంతే సంఖ్యలో ఓటర్ వెరిఫైడ్ ఆడిట్ ట్రయల్ (వీవీపాడ్)లను ఉపయోగిస్తున్నామని చెప్పారు. రేపటితో  ఎన్నికల ప్రచారం ముగియనుందని, నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎవరైనా ప్రచారం నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, రేపు తుది గడువు కావడంతో ప్రధాన రాజకీయపార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. గెలుపుపై ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  
Karnataka
sanjeevkumar

More Telugu News