Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

  • కమ్ముకున్న మేఘాలు
  • ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం
  • సేదదీరుతోన్న నగరవాసులు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడ్డ నగరవాసులు సేదదీరుతున్నారు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో హైదరాబాదీయులు ఉపశమనం పొందుతున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, అమీర్‌పేట్‌, ఎస్సార్‌ నగర్, యూసఫ్‌గూడ, ఎర్రగడ్డ పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్ ప్రాంతాలతో పాటు పలు చోట్ల స్వల్పంగా వర్షం పడుతోంది. పగలంతా చాలా వేడిగా ఉండి ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొచ్చి మారిన వాతావరణం ఆహ్లాదాన్నిస్తోంది.                                        
Hyderabad
rain

More Telugu News