Pawan Kalyan: పవన్‌ మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చారు.. వలస నేతలతో జాగ్రత్తగా ఉండాలి: ప్రకాశ్ రాజ్

  • వలస నేతలు మోసం చేసే ప్రమాదం ఉంది
  • మంచి చేయాలని ప్రయత్నిస్తోన్న పవన్‌ను ఆహ్వానిద్దాం
  • మోదీలా అసత్యాలు చెప్పే వారిని నేను ఎక్కడా చూడలేదు
  • ప్రశ్నిస్తున్నందుకే నాకు యాడ్స్ కూడా రావడం లేదు
కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతోన్న సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ వరుసగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆ పార్టీ తీరుని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ గురించి స్పందించారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో పవన్ కల్యాణ్‌ పార్టీ పెట్టారని, అయితే జనసేనలోకి వచ్చే వలస నేతలతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. వలసనేతలు మోసం చేసే ప్రమాదం ఉందని అన్నారు.

ప్రజలకు మంచి చేయాలని ప్రయత్నిస్తోన్న పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానిద్దామని ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. కాగా, ప్రధాని మోదీలా అసత్యాలు చెప్పే వారిని తాను ఎక్కడా చూడలేదని, తాము సర్కారుని ప్రశ్నిస్తోంటే వారు వ్యక్తిగత విషయాలపై మాట్లాడుతున్నారని అన్నారు. ప్రశ్నిస్తున్నందుకే తనకు నటించడానికి కమర్షియల్ యాడ్స్ కూడా రావడం లేదని తెలిపారు.
Pawan Kalyan
Jana Sena
Prakash Raj

More Telugu News