Viral Videos: గణేశుడికి వడదెబ్బ తగలకుండా కూలర్‌, ఏసీలు పెట్టిన భక్తులు.. వీడియో ఇదిగో!

  • నాగ్‌పూర్‌, కాన్పూర్‌లలో ఘటనలు
  • భక్తిని చాటుకున్న భక్తులు
  • ఎండల నుంచి గణేశుడికి ఉపశమనం లభిస్తుందని నమ్మకం
ఎండల తీవ్రతకి మధ్యాహ్న వేళల్లో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఇంట్లో ఏసీ, కూలర్‌లను పెట్టుకుని ఉక్కపోతనుంచి ఉపశమనం పొందుతున్నారు. అయితే, గుడిలో దేవుడు కూడా ఉక్కపోత ఎదుర్కుంటున్నాడని భావించిన కొందరు భక్తులు ఏసీ, కూలర్‌లు పెట్టిన ఘటనలు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లలో ఉన్న గణేశుడి ఆలయాల్లో చోటు చేసుకున్నాయి.

గణేశుడికి వడదెబ్బ తగలకుండా చేసి భక్తులు తమ భక్తిని ఇలా చాటుకున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందడానికి భక్తులంతా కలిసి ఇలా వినాయకుడికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారని అయా గుడుల పూజారులు తెలిపారు.                      
Viral Videos
Maharashtra
Uttar Pradesh

More Telugu News