gudivad: వైసీపీ అధికారంలోకొస్తే నాయీబ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పిస్తాం!: వైఎస్ జగన్

  • కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ లో పర్యటిస్తున్న వైఎస్ జగన్
  • నాయీబ్రాహ్మణ ఆత్మీయ సదస్సులో పాల్గొన్న అధినేత
  • నాయీబ్రాహ్మణులకు చట్టసభల్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తాం
ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ లో వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక కలవపూడి సత్రం దగ్గర రాష్ట్ర నాయీబ్రాహ్మణ ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జగన్ మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వస్తే నాయీబ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పిస్తామని, చట్టసభల్లో తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, మల్లయ్య పాలెం క్రాస్ రోడ్డు, చౌటపల్లి, పెద పాలపర్రు మీదుగా కల్వపూడి అగ్రహారం క్రాస్ రోడ్డు వెంబడి జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. భోజన విరామం తర్వాత తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది.
gudivad
ys jagan

More Telugu News