akash puri: రవితేజను చూసే హీరో కావాలనుకున్నాను: ఆకాశ్

  • రవితేజ అంటే నాకు ఎంతో ఇష్టం 
  • ఊహ తెలిశాక చూసినవి ఆయన సినిమాలే 
  • ఆయన నుంచి నేర్చుకోవలసింది ఎంతో వుంది
పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా 'మెహబూబా' సినిమా రూపొందింది. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆకాశ్ మాట్లాడుతూ .. అనేక విషయాలను పంచుకున్నాడు.

"రవితేజ గారు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఊహ తెలిసిన తరువాత నేను చూసినవి రవితేజ గారి సినిమాలే. ఆయనతో మా నాన్న చేసిన 'ఇడియట్' .. 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాలు చూశాను. అప్పట్లో నా దృష్టిలో హీరో అంటే రవితేజనే .. నిజం చెప్పాలంటే ఆయనని చూసిన తరువాతనే నేను హీరోను కావాలనుకున్నాను. మా నాన్న .. రవితేజ ఇద్దరూ కూడా ఎంతో కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. వాళ్లిద్దరి నుంచి నేను నేర్చుకోవలసింది ఎంతో వుంది" అని చెప్పుకొచ్చాడు. 
akash puri
raviteja

More Telugu News