Chandrababu: నాకు సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోండి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
- కలెక్టర్ల కాన్ఫరెన్సులో NCBN అప్లికేషన్ ని ఆవిష్కరించిన చంద్రబాబు
- అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ తెలియాలన్న ముఖ్యమంత్రి
- ఈ యాప్ ద్వారా ప్రజల అభిప్రాయాలు, సూచనలు, సలహాలను తెలియజేయొచ్చు
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు వంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్సులో NCBN అప్లికేషన్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ముఖ్యమంత్రి సమాచారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రజల అభిప్రాయాలు, సూచనలు, సలహాలను తెలియజేయవచ్చు. ఇందుకోసం ప్రజలంతా ఈ యాప్‌ని డౌన్ లోడ్ చేసుకుని లాగిన్ అవ్వాలని చంద్రబాబునాయుడు తెలిపారు.
డౌన్ లోడ్ లింక్:
http://onelink.to/c4uyxj