Rahul Gandhi: 2019లో నేనే ప్రధానిని అవుతానేమో!: రాహుల్ గాంధీ

  • 2019లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే..నేనే ప్రధానిని అవుతానేమో !
  • మోదీ సర్కార్ పై ప్రజలు కోపంగా ఉన్నారు
  •  ప్రజాధనాన్ని గాలి సోదరులకు బీజేపీ దోచిపెట్టింది
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. ప్రధాని పదవిపై రాహుల్ తొలిసారి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే .. తానే ప్రధానిని అవుతానేమోనని అన్నారు. మోదీ సర్కార్ పై ప్రజలు కోపంగా ఉన్నారని, అవినీతిపరుడిని కర్ణాటకలో బీజేపీ తరపున సీఎం అభ్యర్థిగా పెట్టిందని విమర్శించారు.

బళ్లారిలో వేల కోట్ల ప్రజాధనాన్ని గాలి సోదరులకు బీజేపీ దోచిపెట్టిందని, ‘గాలి’ వర్గానికి 15 సీట్లు కేటాయించడంపై మోదీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యోగ కల్పన ఎందుకు జరగడం లేదో మోదీ యువతకు సమాధానం చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.
Rahul Gandhi
Congress

More Telugu News