vijay devarakonda: 'టాక్సీవాలా' గురించి ఫిల్మ్ నగర్ టాక్

షార్ట్స్‌లో చూడండి
రాహుల్ సాంకృత్యన్ దర్శకుడిగా పరిచయమవుతూ .. విజయ్ దేవరకొండ హీరోగా 'టాక్సీవాలా' సినిమాను రూపొందించాడు. టాక్సీ డ్రైవర్ కి .. ఒక దెయ్యానికి మధ్య నడిచే కథ ఇది. అందువలన చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అంతా ఈ సినిమాను చూడవచ్చని అంటున్నారు. ఈ  సినిమాను ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితం చెప్పారు.

అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం కష్టమేననే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదట. హడావిడిగా కానిచ్చేస్తే క్వాలిటీ ఉండదనే ఉద్దేశంతో, ఈ విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. గ్రాఫిక్స్ వర్క్ పూర్తయిన తరువాతనే రిలీజ్ డేట్ ను ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చారట. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మాళవిక నాయర్ .. ప్రియాంక జవాల్కర్ నటించిన సంగతి తెలిసిందే
Go Back to Shorts
vijay devarakonda
priyanka
malavika

More Telugu News