సీజే అభిశంసన వ్యవహారంలో సుప్రీంలోనూ కాంగ్రెస్ కు చుక్కెదురు!
- దీపక్ మిశ్రా అభిశంసనపై సుప్రీంలో కాంగ్రెస్ పిటిషన్
- ఈ ఉదయం విచారించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం
- పిటిషన్ ను తోసిపుచ్చిన న్యాయమూర్తులు
నిబంధనల మేరకే ఉపరాష్ట్రపతి నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడ్డ ధర్మాసనం, పిటిషన్ పై తదుపరి విచారణ ఉండబోదని స్పష్టం చేసింది. విషయాన్ని పార్లమెంట్ వేదికగానే తేల్చుకోవాలని సూచించింది. మీకు మీరుగానే పిటిషన్ ను వెనక్కు తీసుకోవాలని పేర్కొంది. ఆపై తమ పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంటున్నామని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు.