ఏంటిది?... పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ 11 వేల మందేనా? సీరియస్ గా తీసుకోండి: రామ్ గోపాల్ వర్మ

  • 'ఆఫీసర్' చిత్రానికి 11 వేల డిస్ లైక్స్
  • పవన్ కు అంతేమంది అభిమానులన్న వర్మ
  • ఫేస్ బుక్ వేదికగా సెటైర్లు
గత కొన్ని రోజులుగా ఎవరిపైనా కామెంట్లు చేయకుండా మౌనంగా ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మరోసారి తన సోషల్ మీడియా ఖాతాలకు పని పెట్టారు. ఇంకోసారి పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసుకున్నారు. ఆయనకు కేవలం 11 వేల మంది మాత్రమే అభిమానులు ఉన్నారని వ్యాఖ్యానించారు. అదెలాగో కూడా చెప్పారు.

అక్కినేని నాగార్జున హీరోగా తాను రూపొందించిన 'ఆఫీసర్' చిత్రం టీజర్ ను ఇటీవల విడుదల చేస్తే సామాజిక మాధ్యమాల్లో 11 వేల డిస్ లైక్స్ వచ్చాయట. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ విషయాన్ని పీకే, జనసేన సీరియస్ గా తీసుకోవాలని వ్యాఖ్యానించారు. తనకు 11 వేల మంది ఫ్యాన్స్ ఉంటే, దాదాపు 11 కోట్ల మంది అభిమానులు ఉన్నట్టు అనుకుంటున్నారని కూడా ఓ సెటైర్ వేశారు.

కాగా, నాగార్జున కొత్త సినిమా టీజర్ కు వేల సంఖ్యలో డిస్ లైక్స్ వస్తున్నాయని, అవన్నీ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్నారన్న ప్రచారం సాగుతున్న వేళ, వర్మ ఈ విధంగా పంచ్ వేశారన్నమాట!
Go Back to Shorts
Pawan Kalyan
ramgopal Varma
Nagarjuna
Officer

More Telugu News