సెకనుకు 27 విమర్శలు... కన్నడనాట కాంగ్రెస్, బీజేపీ సోషల్ మీడియా వార్!
- ముదిరి పాకాన పడ్డ విమర్శల వేడి
- సోషల్ మీడియా వార్ రూమ్ లు బిజీ
- ఒక్కో పార్టీ నుంచి గంటకు లక్ష మెసేజ్ లు
ఇక కాంగ్రెస్ వార్ రూమ్ లో సైతం 25 మందికి పైగానే పని చేస్తున్నారు. వీరి పనల్లా ఒక్కటే, ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలను తయారు చేసి, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడమే. ఇక గంటకు లక్షకుపైగా మెసేజ్ లు ప్రజల్లోకి వెళుతున్నాయని తెలుస్తోంది. అంటే సెకనుకు 27కు పైగా మెసేజ్ లు పోస్ట్ అవుతున్నాయి. అంటే గంటకు లక్ష మెసేజ్ లను వీరు వైరల్ చేస్తున్నారన్నమాట. ఈ మెసేజ్ లు లక్షలాది మంది ఓటర్లకు చేరేలా ముందుగానే ఏర్పాట్లు చేసుకుని ఉన్నాయి ఈ పార్టీలు.