పవన్ కల్యాణ్ వస్తారో... రారో చెప్పలేను: జేడీ (ఎస్) నేత కుమారస్వామి
- కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు
- గతంలో జేడీ (యస్) తరఫున ప్రచారం చేస్తానన్న పవన్ కల్యాణ్
- అనివార్య కారణాల వల్ల రాలేకపోయారన్న కుమారస్వామి
గతంలో పవన్ కల్యాణ్ ఇక్కడికి వచ్చి, తమ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తానని చెప్పారని, అయితే, కొన్ని అనివార్య కారణాల వల్లే ఆయన ఇంతవరకూ రాలేకపోయారని చెప్పిన ఆయన, ప్రచారం ముగిసే సమయం దగ్గర పడిందని గుర్తు చేశారు. ఈ సమయంలో ఆయన పర్యటన ఉంటుందో ఉండదో కచ్చితంగా చెప్పలేనని అన్నారు.