shami: షమీ ఇంటి తాళాన్ని పగలగొట్టాలంటూ ఆయన భార్య డిమాండ్.. తిరస్కరించిన పోలీసులు

  • షమీ స్వగ్రామానికి వెళ్లిన హసీన్ జహాన్
  • తాళం పగలగొట్టి, ఇంట్లోకి వెళ్లేందుకు యత్నం
  • ఇంట్లో ఎవరూ లేనప్పుడు తాళం పగలగొట్టడం కుదరదన్న పోలీసులు
టీమిండియా క్రికెటర్ షమీ భార్య హసీన్ జహాన్ మరోసారి రచ్చ చేసింది. షమీ సొంత ఊరైన ఉత్తరప్రదేశ్ లోని సహస్ గ్రామానికి ఆమె వెళ్లింది. స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి, తనకు రక్షణగా రావాలని పోలీసులను కోరింది. అంతేకాదు, షమీ ఇంటి తాళాన్ని పగలగొట్టాలని డిమాండ్ చేసింది. అయితే ఆమె డిమాండ్ ను పోలీసులు తిరస్కరించారు. ఆ ఇంట్లో ఎవరూ లేరని, ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టడం చట్ట విరుద్ధమని హసీన్ కు స్పష్టం చేశారు.

మరోవైపు ఈ ఘటనపై షమీ బంధువు మొహమ్మద్ జమీర్ స్పందించారు. ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండానే హసీన్ తమ గ్రామానికి వచ్చిందని చెప్పారు. ఆమెను తమ ఇంటికి ఆహ్వానించానని తెలిపారు. అయితే, షమీ స్వగ్రామానికి హసీన్ ఎందుకు వెళ్లిందన్న విషయం మాత్రం తెలియరాలేదు. త్వరలోనే ఆ విషయాలను వెల్లడిస్తానని ఆమె తెలిపారు. 
shami
mohammed shami
haseen jahaan

More Telugu News