పాకిస్థాన్ హోం మంత్రి ఇక్బాల్ పై కాల్పులు!

  • నరోవాల్ లో చోటుచేసుకున్న సంఘటన 
  • వాహనంలో కూర్చుని ఉండగా కాల్పులు జరిపిన యువకుడు
  • ఇక్బాల్ కుడి భుజంలోకి దూసుకెళ్లిన బుల్లెట్
 గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో పాకిస్థాన్ హోం మంత్రి ఇక్బాల్ గాయపడ్డారు. ఇక్బాల్ కుడి చేతి భుజంలోకి బుల్లెట్ దూసుకెళ్లినట్టు పాక్ పత్రిక డాన్ పేర్కొంది. ఈ సంఘటన నరోవాల్ లో ఈ రోజు జరిగిందని, వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ని ఆసుపత్రికి తరలించినట్టు తెలిపింది. ఇక్బాల్ కు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్టు సమాచారం.

కాగా, కాల్పులకు పాల్పడ్డ సాయుధుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నరోవాల్ లో రాజకీయ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన హాజరైన సందర్భంలో ఈ సంఘటన చోటుచేసుకుందని, నిందితుడికి ఇరవై ఏళ్లు ఉండవచ్చని ‘డాన్’ అభిప్రాయపడింది. వాహనంలో ఇక్బాల్ కూర్చుని ఉండగా కాల్పులు జరిపినట్టు సమాచారం.
Go Back to Shorts
Pakistan
iqbal

More Telugu News