కర్ణాటక కోసం రంగంలోకి దిగిన సోనియా!
- అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ నిలుస్తుందని చెబుతున్న సర్వేలు
- అధికారాన్ని ఖాయం చేసుకునేందుకు సోనియాతో ప్రచారం
- 8న బీజాపూర్ లో ర్యాలీ, బహిరంగ సభ
గత రెండు నెలలుగా ఆయన పలుమార్లు కర్ణాటకలో పర్యటించి, తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వివిధ ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలనూ ఆయన చుట్టిరావడం గమనార్హం. ఇక సోనియా 8న బీజాపూర్ లో జరిగే ఎన్నికల ర్యాలీతో ప్రచారాన్ని ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికైన తరువాత, ఓ ఎన్నికల ప్రచారంలో సోనియాగాంధీ పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇటీవలి పార్టీ అంతర్గత సర్వేలో మరోసారి అధికారం చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయని వెల్లడి కావడంతో, దాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాను కూడా వస్తానని సోనియా స్వయంగా వ్యాఖ్యానించడంతోనే ఆమె పర్యటనకు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.