కాటసాని చేరికతో వైసీపీలో లొల్లి.. జగన్ మాకు అన్యాయం చేయరన్న గౌరు
- కాటసాని వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది
- పాణ్యం టికెట్ తనదే అంటూ అసత్య ప్రచారం చేసుకుంటున్నారు
- జగన్ నుంచి తమకు స్పష్టమైన హామీ ఉంది
గత ఎన్నికల సమయంలో కూడా నామినేషన్ వేసేంత వరకు పాణ్యం వైసీపీ టికెట్ తనకే వస్తుందని కాటసాని ప్రచారం చేసుకున్నారని... ఇప్పుడు మళ్లీ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని గౌరు వెంకటరెడ్డి మండిపడ్డారు. అవకాశం ఉంటే అధిష్ఠానం వద్ద ప్రయత్నాలు చేసుకోవాలే కానీ, నియోజకవర్గంలో తప్పుడు ప్రచారం చేసుకోవడం సీనియర్ నాయకుడైన కాటసానికి తగదని అన్నారు.