jagan: అమరావతిలో జగన్ ఛాంబర్ వద్ద భారీ పోలీసు భద్రత!

  • అమరావతిలో భారీ వర్షం
  • జగన్ ఛాంబర్ వద్దకు వెళ్లకుండా ఆంక్షలు
  • ఈదురు గాలులతో భయాందోళనలలో సచివాలయ ఉద్యోగులు
అమరావతిలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పరిసర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఈ నేపథ్యంలో, ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్ వద్ద పోలీసు భత్రతను పెంచారు. ఛాంబర్ వద్దకు ఎవరూ వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఫొటోలు, వీడియోలు తీయకూడదని ఆంక్షలు విధించారు. వర్షాల కారణంగా జగన్ ఛాంబర్ లోకి ఇంతకు ముందు నీరు పోయిన సంగతి తెలిసిందే. ఈదురు గాలులు బలంగా వీస్తుండటంతో, సచివాలయ ఉద్యోగులు భయాందోళనలకు గురవున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. 
jagan
secretariat
rain

More Telugu News