narendra modi: మోదీకి 'ఎఫ్' గ్రేడ్ ఇచ్చిన రాహుల్ గాంధీ

  • కర్ణాటక రైతులకు చేసిందేమీ లేదు
  • వ్యవసాయ రుణాలు ఇవ్వలేదు
  • పంటల బీమా పథకంలో కూడా రైతులకు అన్యాయమే జరిగింది
కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా విమర్శలు కురిపించారు. కర్ణాటకలోని వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ విషయంలో మోదీకి ఎఫ్ గ్రేడ్ ఇస్తానని చెప్పారు.

రూ. 8,500 కోట్ల వ్యవసాయ రుణాలను ఇస్తామని చెప్పి, ఇంతవరకు ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. పంటల బీమా పథకంలో కూడా రైతులకు అన్యాయమే జరిగిందని, ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు మాత్రం బాగుపడ్డాయని మండిపడ్డారు. పంటకు మద్దతు ధర కల్పించడంలో కూడా విఫలమయ్యారని అన్నారు. ఈ నెల 12వ తేదీని కర్ణాటకలోని 224 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 15వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. 
narendra modi
Rahul Gandhi

More Telugu News