siddaramaiah: అందుకే మీరు రెండు చోట్ల పోటీ చేశారా?: మోదీకి సిద్ధరామయ్య చురక

  • 2014లో మోదీ రెండు చోట్ల పోటీ చేశారు
  • ఓటమి భయంతోనే రెండు చోట్ల పోటీ చేశారా?
  • బీజేపీది 2రెడ్డి+1యెడ్డీ ఫార్ములా
ఓటమి భయంతోనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగారంటూ ప్రధాని మోదీ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలను సిద్ధూ ఖండించారు. 2014 ఎన్నికల్లో మీరు రెండు చోట్ల ఎందుకు పోటీ చేశారో చెప్పాలంటూ మోదీని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే వడోదర, వారణాసి నియోజకవర్గాల నుంచి మోదీ పోటీ చేశారని... దానికి ఇప్పుడు ఆయన స్వయంగా వివరణ ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ఇప్పుడు 2 ప్లస్ 1 ఫార్ములాతో రాజకీయాలు నడుస్తున్నాయంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు నిజమేనని... కాకపోతే, ఆ ఫార్ములా బీజేపీకే వర్తిస్తుందని.. 2రెడ్డి ప్లస్ 1యెడ్డీ(యెడ్యూరప్ప) బీజేపీ ఫార్ములా అని అన్నారు. 
siddaramaiah
Narendra Modi
yeddyurappa
karnataka
elections

More Telugu News