metro: రెండు నెలల్లో ఎల్బీనగర్‌లోనూ పట్టాలెక్కనున్న మెట్రో రైలు.. కేటీఆర్ ప్రకటన!

  • వివరించిన కేటీఆర్‌
  • నాగోల్‌ వరకు కూడా ఈ మార్గాన్ని కలుపుతాం
  • భవిష్యత్తులో విమానాశ్రయం వరకు పొడిగింపు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా రెండు నెలల్లో ఎల్బీనగర్‌ మార్గంలోనూ మెట్రో రైల్‌ ప్రారంభమవుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అలాగే, ఎల్బీనగర్‌ నుంచి నాగోల్‌ వరకు కూడా ఈ మార్గాన్ని కలుపుతామని చెప్పారు. భవిష్యత్తులో ఫలక్‌నుమా మీదుగా హైదరాబాద్‌ విమానాశ్రయం వరకు పొడిగిస్తామని తెలిపారు. కొందరు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఈ రోజు ఎల్బీనగర్‌లోని చింతల్‌కుంట అండర్ పాస్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు.

ఎల్బీనగర్‌లో ఎడమ వైపు చేపట్టిన అండర్ పాస్‌ ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్‌ చెప్పేందుకు పెద్ద ఎత్తున పనులు చేపట్టామని చెప్పారు. మూసీపై ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న 185 చెరువుల్లో మొదటిదశలో 40 చెరువులను ఉపయోగకరంగా తీర్చిదిద్దుతామని అన్నారు.     
metro
Hyderabad
KTR

More Telugu News